హైదరాబాద్ బండ్లగూడలో అగ్నిప్రమాదం..!!

హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా బండ్లగూడ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

 Fire Accident In Bandlaguda, Hyderabad Bandlaguda, Hyderabad , Fire Accident , F-TeluguStop.com

జనవరి నెలలో ఆల్రెడీ ఈ ప్రాంతంలో రబ్బరు కంపెనీ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఆ సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

అదుపు చేయటానికి ఫైర్ సిబ్బంది అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రంగారెడ్డి మెదక్ సరిహద్దు ప్రాంతంలో బండ్లగూడ పారిశ్రామికవాడలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

కాగా ఇప్పుడు.అదే ప్రాంతంలో ఫుడ్ పాత్ పై ఓ షాపులో మంటలు చెలరేగాయి.

ఈ అగ్ని ప్రమాదంలో మహిళా గాయపడటంతో పాటు మంటలను అదుపు చేయటానికి వచ్చిన ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారు.మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.

అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ మహిళా మరియు ఫైర్ సిబ్బందికి పెద్దగా గాయాలు కాలేదు.మరో పక్క మాత్రం మంటలు భారీ ఎత్తున చెల్లరేగుతున్నాయి.

ఈ ఏడాది జనవరి నెలలో ఇప్పుడు ఫిబ్రవరి నెలలో బండ్లగూడ ప్రాంతంలో వరుసగా రెండుసార్లు అగ్ని ప్రమాద సంఘటనలు చోటు చేసుకోవడంతో.ఈ ప్రాంత వాసులు భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube