కియారా సిద్ధార్థ్ మల్హోత్రా గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉంటూ రహస్యంగా వీరి ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు తమ గురించి వస్తున్నటువంటి ఈ ప్రేమ వార్తలను ఖండిస్తూ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్నటువంటి వార్తలను ఖండించారు.
అయితే చివరికి వారి ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఎంతో ఘనంగా ఈ దంపతులు ఫిబ్రవరి 7వ తేదీ అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు.వీరి వివాహ వేడుక చిరకాలం గుర్తుండిపోయే విధంగా జైపూర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఇక వీరి వివాహానికి కేవలం అత్యంత సన్నిహితులు బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.ఇలా కొద్దిమంది సమక్షంలో వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఇకపోతే ఆదివారం సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ ముంబైలో ఎంతో ఘనంగా జరిగింది.సినీ సెలబ్రిటీల కోసం ఈ దంపతులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి వీరి రిసెప్షన్ ను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఇక వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు.

ఆదివారం సాయంత్రం ముంబైలోని ఓ రెస్టారెంట్ లో వీరి వివాహ రిసెప్షన్ ఎంతో ఘనంగా జరిగింది.ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ అజయ్ దేవగన్,కాజల్ దంపతులు హాజరయ్యారు.వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
అలాగే విద్యాబాలన్, కరీనాకపూర్, రాశిఖన్నా, కరణ్ జోహార్ వంటి తదితర సెలబ్రిటీలు ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యి సందడి చేశారు.ప్రస్తుతం వీరి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







