సాధారణంగా ట్రైన్స్‌లో ఫుడ్ క్వాలిటీ చాలా వరస్ట్‌గా ఉంటుంది.ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి.
దానికి తోడు ఫుడ్ విక్రయదారులలో స్కామర్స్( Scammers ) కూడా ఎక్కువగానే ఉంటున్నారు.ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ క్యాటరర్లు( IRCTC Caterers ) కస్టమర్లకు టోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తాజాగా ఒక క్యాటరర్ స్కామ్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల ఓ మహిళ తన కుటుంబంతో కలిసి బ్రహ్మపుత్ర మెయిల్( Brahmaputra Mail ) డైలీ ట్రైన్‌లో పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది.ఆ సమయంలో వారు ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ సర్వీస్ నుంచి వెజ్ థాలీలను( Veg Thali ) ఆర్డర్ చేసారు, అయితే క్యాటరర్ ఒక్కొక్క వెజ్ థాలీ కోసం రూ.150 వసూలు చేశారు.ప్యాసింజర్లు ఆ ప్రైస్ చాలా ఎక్కువ అని భావించారు.బిల్లు అడిగితే వెజ్ థాలీ రూ.80 అని, పనీర్ సబ్జీ రూ.70 అని రెండు వస్తువులుగా విభజించి సిబ్బంది మోసం చేసేందుకు ప్రయత్నించారు.
కానీ తాము పనీర్ సబ్జీని ఆర్డర్ చేయలేదని, దాన్ని బిల్లు ఎలా తయారు చేసారంటూ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు.గంటపాటు వాగ్వాదానికి దిగిన సిబ్బంది ఫ్యామిలీ పై గెలవలేక చేతులెత్తేసుకుని ఒక్కో థాలీకి రూ.80 బిల్లు కడితే చాలు అని అన్నారు.ఈ సంఘటన గురించి ఆమె @ruchikokcha అనే యూజర్ అకౌంట్ ద్వారా మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో తెలియజేసింది.
ఐఆర్‌సీటీసీ( IRCTC ) సిబ్బంది ప్రజాధనాన్ని అధికంగా వసూలు చేస్తూ బిల్లుకు అదనపు వస్తువులను వేసి దోచుకుంటున్నారని ఆమె అన్నారు.అందుకు రుజువుగా బిల్లు ఫొటోను పోస్ట్ చేసింది.
ఆమె పోస్ట్ వైరల్ అయ్యింది.ఇతర యూజర్లు అనేక వ్యాఖ్యలు చేశారు.వారిలో కొందరు ఐఆర్‌సీటీసీ ఫుడ్ క్వాలిటీ, అన్యాయమైన ధరల గురించి విమర్శించారు.మరికొందరు స్కామ్‌ను బయటపెట్టి బలమైన సందేశాన్ని పంపారని మహిళను ప్రశంసించారు.ఇది సాధారణ సమస్య అని, చాలా మంది ప్రయాణికులు బిల్లులు అడగడం లేదా సరైన ఆహారం తీసుకోవడం లేదని వారిలో కొందరు తెలిపారు.ఐఆర్‌సీటీసీ సిబ్బంది ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు తీసుకోవడం అలవాటుగా మారిందని వాపోయారు.
@RailwaySeva అఫీషియల్ అకౌంట్ కూడా ఆమె పోస్ట్‌కి రిప్లై ఇచ్చింది.ఆమె PNR, మొబైల్ నంబర్‌ను ప్రైవేట్ మెసేజ్‌లో పంచుకోవాలని వారు ఆమెను కోరారు.ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.ప్లాట్‌ఫామ్‌లో ఆమె పోస్ట్‌కి ఇప్పటివరకు 10 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.