ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను వైసీపీ అధినేత జగన్( CM Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
ఇదే సమయంలో ఎన్నికలను నాయకులు చాలా సీరియస్ గా తీసుకోవాలని ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఎట్టి పరిస్థితులలో 175 కి 175 నియోజకవర్గాలు గెలవాలని టార్గెట్ గా కూడా పెట్టుకోవడం జరిగింది.
కాగా 2024 ఎన్నికలకు సంబంధించి ఏడాది ముందునుండే రకరకాల పార్టీ కార్యక్రమాలతో ప్రజా ప్రతినిధులు నేతలు నిత్యం ప్రజలలో ఉండేలా వ్యవహరించారు.
గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న ఆరోగ్య సురక్ష, వైసీపీ సామాజిక బస్సు యాత్ర.
ఇలా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో… వైయస్ జగన్ నేరుగా రంగంలోకి దిగి “సిద్ధం” సభలతో( Siddham Meeting ) హోరెత్తిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాలలో “సిద్ధం” సభలు జరిగాయి.ఉత్తరాంధ్రాకి సంబంధించి భీమిలిలో, కోస్తాకి సంబంధించి దెందులూరులో, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాప్తాడులో నిర్వహించిన “సిద్ధం” సభలకు లక్షలలో జనాలు హాజరయ్యారు.
![Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Cm Jagan, Palnadu, Ysrcp-Latest News - Telu Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Cm Jagan, Palnadu, Ysrcp-Latest News - Telu](https://telugustop.com/wp-content/uploads/2024/02/February-tweenty-seventh-YCP-will-be-held-key-meeting-of-in-Tadepally-detailss.jpg)
కాగా మార్చి మూడవ తారీఖు నాడు పల్నాడు( Palnadu ) ప్రాంతంలో నాలుగో “సిద్ధం” సభ నిర్వహించడానికి వైసీపీ( YCP ) అధిష్టానం రెడీ అవుతూ ఉంది.ఇదిలా ఉంటే ఇటీవల తెలుగుదేశం జనసేన కూటమికి( TDP Janasena Alliance ) సంబంధించి తొలి జాబితా విడుదల చేయడం జరిగింది.తెలుగుదేశం పార్టీకి సంబంధించి 94 స్థానాలు జనసేన పార్టీకి సంబంధించి 24 అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలు విడుదల చేశారు.దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది.
ఈ క్రమంలో అనుభవంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫిబ్రవరి 27వ తారీకు తాడేపల్లిలో సమావేశం నిర్వహించడానికి రెడీ అయ్యారు.
![Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Cm Jagan, Palnadu, Ysrcp-Latest News - Telu Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Cm Jagan, Palnadu, Ysrcp-Latest News - Telu](https://telugustop.com/wp-content/uploads/2024/02/February-tweenty-seventh-YCP-will-be-held-key-meeting-of-in-Tadepally-detailsd.jpg)
తాడేపల్లిలో సీకే కన్వెన్షన్ లో సీఎం జగన్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది.రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు.ఈ సమావేశానికి మండల స్థాయి నేతలు కూడా హాజరుకానున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేయబోతున్నారు.టీడీపీ జనసేన కూటమి మొదటి లిస్టు విడుదలైన తర్వాత.
వైసీపీ నిర్వహిస్తున్న ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో చర్చినియంశంగా మారింది.