ఇదేందయ్యా ఇది : కరోనా కి డాడీ చైనా అంట...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.

ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన పడి లక్షల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందగా ఇప్పటికీ చాలా మంది ఈ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నారు.

కాగా ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రముఖ పత్రిక కరోనా వైరస్ గురించి హైలెట్ చేస్తూ ప్రచురించిన ఓ కార్టూన్ బొమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇందులో కరోనా వైరస్ రూపంతో ఉన్నటువంటి ఓ బొమ్మ చైనా  అధ్యక్షుడిని నాన్న అని పిలుస్తూ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంటూ విషెస్ చెబుతోంది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక మరికొంత మంది నెటిజన్లు మాత్రం కరోనా  వైరస్ పుట్టింది చైనాలోనే కాబట్టి కచ్చితంగా గా కరోనా  వైరస్ కి డాడీ చైనా నే అంటూ వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గణాంకాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,25000 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 13700 మంది ప్రాణాలు కోల్పోయారు.మరో 2 లక్షల 35 వేల పైచిలుకు మంది విజయవంతంగా కరోనా వైరస్ బారి నుండి కోలుకున్నారు.

Advertisement

అయితే ఇటీవలే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో మళ్లీ లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు