ఫ్యాన్ స్పీడ్‌కి విద్యుత్ వినియోగానికి సంబంధం ఉందా?

సీలింగ్ ఫ్యాన్‌ను ఒకటో నంబర్‌తో రన్ చేస్తే తక్కువ, ఐదవ నంబర్‌తో రన్ చేస్తే ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుందా? ఇటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది.దీనికి సమాధానం ఏమిటో ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం.

 Fans Consume The Same Electricity When Operated At Different Speeds , Fans Consu-TeluguStop.com

చాలామంది తమ ఇళ్లలో విద్యుత్ పొదుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.పెరుగుతున్న కరెంటు బిల్లును అదుపు చేసేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈ నేపధ్యంలో తక్కువ విద్యుత్ వినియోగంతో అధికమైన పని జరిగేలా పలు శాస్త్రీయ పద్ధతులను కూడా అవలంబిస్తున్నారు.నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద ఏసీ నడిచేలా చేస్తూ, విద్యుత్‌ను వీలైనంత ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

దీనిని గమనించిన చాలామంది ఫ్యాన్‌ విషయంలో ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తూ, రెగ్యులేటర్ సాయంతో విద్యుత్ వినియోగాన్ని నియంత్రిస్తున్నారు.ఫ్యాన్ తక్కువ వేగంతో తిరిగితే విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని చాలామంది అనుకుంటారు.

అయితే ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఫ్యాను వేగంతో విద్యుత్ వినియోగానికి సంబంధం అస్సలు ఉందడని వాదిస్తుంటారు.దీనికి నిపుణులు చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అయ్యే విద్యుత్ వినియోగానికి, దాని వేగానికి సంబంధం ఉంటుందంటున్నారు.

అది ఫ్యాను రెగ్యులేటర్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

రెగ్యులేటర్ సాయంతో ఫ్యాన్ వేగాన్ని అదుపుచేస్తూ, విద్యుత్ వినియోగాన్ని స్వల్పం లేదా అధికం చేయవచ్చని నిపుణులు వివరించారు.కాగా విద్యుత్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపని, ఫ్యాన్ వేగానికి పరిమితం చేయని అనేక రెగ్యులేటర్లు ఉన్నాయి.

ఫ్యాన్ వేగాన్ని విద్యుత్తును ఆదా చేస్తుందా లేదా అనేది రెగ్యులేటర్ తరహాపై ఆధారపడి ఉంటుంది.అయితే ఏ రెగ్యులేటర్ విద్యుత్తును ఆదా చేస్తుందో.ఏ రెగ్యులేటర్‌లో అలాంటి సౌకర్యం లేదో ఇప్పుడు తెలుసుకుందాం.వోల్టేజీని తగ్గించి, ఫ్యాన్ వేగాన్ని అదుపు చేసే అనేక ఫ్యాన్ రెగ్యులేటర్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ రెగ్యులేటర్లు ఫ్యానుకు పంపిణీ అయ్యే వోల్టేజ్‌ని తగ్గించడానికి, దాని వేగాన్ని అదుపు చేయడానికి ఉపయోగపడతాయి.ఈ తరహాలో ఫ్యాన్‌లో విద్యుత్ వినియోగం అదుపులోకి వస్తుంది.

అయితే ఇది విద్యుత్తును ఆదా చేయలేదు.ఎందుకంటే ఈ రెగ్యులేటర్ రెసిస్టర్‌గా మాత్రమే పనిచేస్తుంది.

ఎప్పుడూ అదే మొత్తంలో విద్యుత్తును దానిలోకి పంపిస్తుంది.ఈ విధంగా ఫ్యాన్ వేగాన్ని అదుపుచేయడం వల్ల విద్యుత్ వినియోగంపై ​​గణనీయమైన ప్రభావం ఏర్పడదు.

ఈ వ్యవస్థ పాత రెగ్యులేటర్లలో ఉండేది.అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రెగ్యులేటర్ తీరుతెన్నులు పలు రకాలుగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube