అమెరికాలో ప్రముఖ జానపద గాయని కన్నుమూత..!

దేవుల పల్లి కృష్ణ శాస్త్రి మేనకోడలు, ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని గాయని అనసూయ దేవి కన్నుమూశారు.అమెరికాలోని హ్యుస్టన్‌లో ఆమె మరణించారని తెలిపారు.

ఆమె వయస్సు 99 ఏళ్ళు.1920 మే 12న కాకినాడలో జన్మించిన ఆమె.జానపద పాటలు పాడటంలో పెట్టింది పేరు.అప్పట్లో ఆలిండియా రేడియోలో ఆమె పాటలకోసం కాచుకుని కూర్చునే వారు ఎంతో మంది.

ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న ఆమె ఆంధ్రా వర్సిటీ నుంచీ కళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు.

డాక్టరేట్ ని కూడా ఆంధ్రా యూనివర్సిటీ ప్రధానం చేసింది.అనుసూయా దేవికి ఐదుగురు సంతానం.ఆమె మరణ వార్త విని ఎంతో చలించిపోయామని, ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నామని కాకినాడ వాసులు తెలిపారు.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?
Advertisement

తాజా వార్తలు