మ్యాట్రిమోని లో ఫేక్ ప్రొఫైల్..నిండా మునిగిన హైదరాబాద్ యువతి..!

ప్రస్తుత సమాజంలో ఎవరు మంచివారో.ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టం.

కొంతమంది కష్టపడకుండా డబ్బు సంపాదించడం కోసం మంచితనం అనే ముసుగు వేసుకొని అమాయకులను దోచుకుంటుంటారు.

కాబట్టి ఎవరైనా అపరిచితులు పరిచయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

హైదరాబాదుకు( Hyderabad ) చెందిన ఓ యువతికు మ్యాట్రిమోని( Matrimony ) ద్వారా పరిచయం అయిన వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి( ACP Sivamaruti ) తెలిపిన వివరాల ప్రకారం.ఓ యువతి మ్యాట్రిమోని సైట్ లో తన పేరు రిజిస్టర్ చేసుకున్నాక.

Advertisement

ఆ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.కొంత కాలం వీరు మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం చేశారు.

ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్లుగా ఆ యువతిని పూర్తిగా నమ్మించాడు.తాను అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, ఇండియాకు వచ్చాక వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి పూర్తిగా అతనిని నమ్మేసింది.

తనను పూర్తిగా నమ్మింది అని భావించిన ఆ వ్యక్తి కొద్ది రోజుల తర్వాత ఆ యువతికి ఫోన్ చేసి ఇండియాలో ఉన్న తమ బంధువుకు చాలా సీరియస్ గా ఉందని, వైద్యం చేయించడానికి డబ్బులు కావాలని అడిగాడు.తాను ఇండియాకు వచ్చిన వెంటనే ఆ డబ్బులన్నీ తిరిగి ఇస్తానని, వివాహం కూడా చేసుకుంటానని నమ్మకపు మాటలు పలికాడు.

ఈ విషయాలను పూర్తిగా నమ్మేసిన ఆ యువతి విడతల వారీగా దాదాపు రూ.30 లక్షల వరకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసింది.ఇక నెమ్మదిగా ఆ యువతిని ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వాకింగ్ వ‌ల్ల గ‌ర్భిణీలు ఎలాంటి లాభాలు పొందుతారు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత సేపు వాకింగ్ చేయొచ్చు?

దీంతో ఆ యువతికి తాను మోసపోయానేమో అని అనుమానం వచ్చింది.వెంటనే హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

Advertisement

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇలాంటి తరహా మోసాలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగాయని, అపరిచిత వ్యక్తులు చెప్పే మాయ మాటలను నమ్మి మోసపోకుండా, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తలు