ఎల్ఐసీ ఏజెంట్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి - మాజీ జేడి లక్ష్మీనారాయణ

ఎల్ఐసి ఏజెంట్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని మాజీ జేడీ లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అమీర్పేట ఎల్ఐసి కార్యాలయంలో ఏజెంట్లు నిర్వహించిన ఆందోళనకు హాజరైన ఆయన కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి కార్పొరేషన్ అవలంబిస్తున్న విధానాలు సరైనవి కావని అన్నారు.

సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే ఏజెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు.కొందరు వ్యక్తులకే లబ్ది చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు.గత 45 రోజులుగా ఏజెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని ఇది కూడా రైతు ఉద్యమంలా ఉదృతం అయ్యేలా చూడవద్దని హెచ్చరించారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు