కాలం మారింది.ఈ కాలంలో శారీరిక శ్రమ కంటే మానసిక శ్రమే ఎక్కువ ఉంటుంది.
ఇంకా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రోజుకు కనీసం 100 అడుగులు కూడా వెయ్యకుండా ఎక్కడ పడుకున్నవారు అక్కడ.ఎక్కడ కూర్చున్న వారు అక్కడ కూర్చుంటున్నారు.
ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు కూర్చుని పని చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
నడవడం అంటే కూడా మర్చిపోతున్నారు.
దీని వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. లాక్ డౌన్ ముందు కేవలం 8 గంటలు మాత్రమే కూర్చుని పని చేసేవారు.8 గంటలు అంటే కేవలం 5 గంటలు మాత్రమే పని.కానీ ఇప్పుడు రోజంతా 8 గంటలకు మించి పని చేస్తున్నారు.దీని వల్ల హైపో థైరాయిడిజం అనే ముప్పు వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారిపై పరిశోధకులు పరిశోధన చెయ్యగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వారానికి 53 నుంచి 83 గంటలు పనిచేసేవారిలో హైపో థైరాయిడిజం సమస్య ఎక్కువ ఉంటుందని ఇది వెంటనే తగ్గకుండా మిగితా సమస్యలతో పాటు మధుమేహానికి దారి తీస్తుందని వారు చెప్పారు.అతి తక్కువ సమయంలోనే పని పూర్తి చేసుకొని కూర్చోవడం తగ్గించి ఎక్కువ నడవడం అలవాటు చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.