సినీ నటులు డ్రగ్స్ వాడినట్లు బలమైన ఆధారాల్లేవ్.. కెల్విన్ చెప్పింది నమ్మలేం

టాలీవుడ్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రధాన నిందితుడు కెల్విన్ చెప్పిన అంశాలు నమ్మశక్యంగా లేవని వారు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు బలమైన ఆధారాలు కూడా లేవని ఎక్సైజ్ శాఖ చార్జిషీట్లో పేర్కొంది.

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్ డ్రగ్స్ వాడినట్లు కెల్విన్ చెప్పాడని అయితే వారితో సహా ఏ సెలబ్రిటీ వద్ద డ్రగ్స్ లభించలేదని, ఆ ఇద్దరూ ఇచ్చిన బయోశాంపిల్స్ లో   కూడా డ్రగ్స్  వాడినట్లు నిర్ధారణ కాలేదని ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ గా స్పష్టం చేసిందని స్పష్టం చేసింది.

డ్రగ్స్ దండ కేసులో కెల్విన్ రంగారెడ్డి జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ అందులో అనేక అంశాలను ప్రస్తావించింది.కెల్విన్ కు మంగుళూరులో చదువుకునేటప్పుడు నుంచి డ్రగ్స్ అలవాటు ఉందని 2013 నుంచి మిత్రులకు డ్రగ్స్ విక్రయించే వాడని ఎక్సైజ్ శాఖ చార్జిషీట్లో పేర్కొంది.

గోవా తో పాటు విదేశాలనుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ తెప్పించాడని వాట్సాప్, మెయిల్ ద్వారా ఆర్డర్ తీసుకుని సరఫరా చేశాడని వివరించింది.అయితే ఎక్కడి నుంచి డ్రగ్స్ కొన్నది దానికి సంబంధించి సంస్థలు, వ్యక్తుల చిరునామా ఇతర వివరాలు వెల్లడించలేదని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని సోదాలు సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.సెలబ్రిటీల పై బలమైన, తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.

Advertisement

సినీ ప్రముఖులపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవన్న ఎక్సైజ్ శాఖ.నటులపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది.సెలబ్రేట్ ల నుంచి ఎలాంటి డ్రక్స్ ను స్వాధీనం చేసుకోలేదని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

సెలబ్రిటీలను నిందితులగా చేరడానికి కారణం కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలమేనని తెలిపింది.దర్యాప్తు అనంతరం కెల్విన్ కేసును తప్పుదారి పట్టించేందుకు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు భావించాల్సి వస్తుందని.

ఆయన చెప్పిన అంశాలకు ఎలాంటి బలమైన ఆధారాలు లేవని తెలిపింది.అన్ని సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి విశ్లేషించిందని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ.నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని తెలిపింది.సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ వాంగ్మూలం సరిపోదని నిందితులు, సాక్షులు జాబితాలో సినీ తారల పేర్లు పొందపరచలేదని ఎక్సైజ్ శాఖ  వివరణ ఇచ్చింది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు