మాజీ సర్పంచ్ కుటుంబానికి అండగా మాజీ సర్పంచులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాకు చెందిన మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ అనారోగ్యంతో మరణించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సర్పంచులు మానవత్వంతో మాజీ సర్పంచ్ అయిన శంకర్ నాయక్ కుటుంబానికి అండగా నిలిచి, రూ.

60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.సమాజంలో అనేక స్నేహ బంధాలను చూశాం కానీ,ఓ మండలంలో మాజీ సర్పంచుల అందరూ ఒక్కటిగా నిలిచి మృతి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబానికి అండగా నిలిచిన ఇలాంటి స్నేహాన్ని ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దోనూరి జైపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్,బానోతు కిషన్, మెగావత్ రెడ్యా,మాజీ సర్పంచులు,స్థానికులు పాల్గొన్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

Latest Yadadri Bhuvanagiri News