విజయవాడ: మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్.జగనన్న సురక్ష పేరుతో దేశంలోనే ఎవరూ చేయని విధంగా పేదలకు మేలు చేశాం…పేదలందరికీ సురక్ష ద్వారా సర్టిఫికెట్స్ అందించి పథకాలు అమలు చేస్తున్నాం.భారతదేశ చరిత్రలో ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది.15వేల సచివాయలయాల్లో కోటిమంది కి లబ్ధి చేకూరింది.93.5లక్షల అభ్యర్థనలు పరిష్కరించాం.జూలై 17 ఒక్కరోజే 7.5లక్షల సర్టిఫికెట్స్ అందించి రికార్డు సృష్టించాం.పశ్చిమలో 85వేల ఇళ్లకు చేరువై 90 క్యాంపుల ద్వారా 31వేల సర్టిఫికెట్లు అందించాం.40ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు కి ఏనాడూ ఇలాంటి ఆలోచన రాలేదు.అర్హత ఉన్నవారికి పథకాలు అందాలనే చిత్తశుద్దితో ప్రభుత్వం ఉంది.చంద్రబాబు అయితే పత్రాలు లేవని పథకాలు ఆపేసేవారు.
పథకాల అమలుకు ప్రభుత్వ లోపం ఉండకూడదనే సురక్ష తీసుకొచ్చాం.లోకేష్ సాయంత్రం పాదయాత్ర చేస్తాడు.
పవన్ కూడా సాయంత్రమే వారహి ఎక్కుతాడు.సినిమాలో రాజకీయ డైలాగులు పెట్టడం వల్ల ఎవర్నీ భయపెట్టలేవు.
రాజకీయాల్లో జీరోగా ఉన్న నువ్వు సినిమా పరంగా కూడా జీరో కాబోతున్నాడు.పవన్ కళ్యాణ్ వల్ల అతని మేనల్లుడికి నష్టం జరిగింది.
బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ప్యాకేజీ రాజకీయాలు చేస్తున్నావని నీ అభిమానులు అసహ్యించుకుంటున్నారు.
పేద ప్రజలకు న్యాయం చేసేందుకు సీఎం జగన్ ఎంతవరకైనా వెళ్తారు.అమరావతిలో పేదలు నివాసం ఉండకూడదు అన్న చంద్రబాబు ఆలోచన దుర్మార్గం.
పేదలకు అండగా వైకాపా పెత్తందారులకు అండగా చంద్రబాబు.







