మాజీ మంత్రి కిడారి కి, బుద్దా కు కరోనా...

ఏపీ మాజీ మంత్రి, ,దివంగత టీడీపీ నేత కిడారి స్వర్వేశ్వర రావు తనయుడు కిడారి శ్రవణ్, అలానే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇద్దరూ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలుపగా, కిడారి కి కరోనా వచ్చిన విషయాన్నీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కరోనా బారినపడినట్లు తెలుస్తుంది. కిడారి శ్రవణ్,అలానే బుద్ధా వెంకన్న ఇద్దరూ కూడా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు.

గతంలో కిడారి శ్రవణ్ అనూహ్యరీతిలో మంత్రి కావడం తెలిసిందే.ఆయన తండ్రి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్యచేయడంతో టీడీపీ అధినాయకత్వం ఆయన తనయుడు కిడారి శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించింది.

అయితే, ఆయన పదవిని చేపట్టిన ఆరు నెలల లోపు చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉండగా, ఆ గడువు ముగిసిపోవడంతో కిడారి పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు రాజీనామా చేసిన విషయం విదితమే.బుద్ధా వెంకన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండమని డాక్టర్ సూచించినట్లు తెలిపారు.

Advertisement

ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ, నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్‌ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ ఆయన ట్వీట్ చేసారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు