ఇవాళ కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరి కొంతమంది ముఖ్యనేతలు ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జూపల్లి, ఇతర నేతలు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

జూపల్లితో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.అయితే కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా పార్టీలో చేరాల్సి ఉంది.

కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది.ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో జూపల్లి, ఇతర నేతలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

Advertisement
పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

తాజా వార్తలు