పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది.ఈ యాత్రకు ఇప్పటికే వారాహి విజయ యాత్రగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

వారాహి యాత్ర ప్రారంభం నేపథ్యంలో మరికాసేపట్లో జనసేనాని పవన్ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు.తరువాత వారాహికి పవన్ పూజలు నిర్వహిస్తారు.

అనంతరం అన్నవరం నుంచి కత్తిపూడి వరకు వారాహిలో పవన్ ర్యాలీ నిర్వహించనున్నారు.కాగా ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ వారాహి విజయ యాత్ర సాగనుంది.

Advertisement
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

Latest Latest News - Telugu News