అందరి టార్గెట్ వీర్రాజే ? పదవీ గండం తప్పదా ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Viraraju ) పెద్ద గండమే వచ్చి పడింది.ఇటీవల వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బిజెపి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

 Everyone's Target Is Virraj  Isn't Tenure A Must, Ap Bjp President, Somu Veeraju-TeluguStop.com

కనీసం డిపాజిట్లు కూడా తక్కించుకోలేకపోయింది.మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది.

ఈ సమయంలోను కనీస ప్రభావం బిజెపి చూపించలేకపోవడంపై బీజేపీ అధిష్టానం పెద్దలు కూడా సీరియస్ గానే ఉన్నారట.ఇక  విశాఖ  బీజేపీ కీలక నేత విష్ణు కుమార్ రాజు( Vishnu Kumar Raju ) కూడా ఈ వ్యవహారం పై తనదైన శైలిలో సొంత నేతలపై సెటైర్లు వేశారు.

బిజెపి, వైసిపి రెండు ఒకటేనని జనాలు భావిస్తున్నారని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి తగ్గట్లుగానే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లతో ఫోటోలు దిగి బిజెపి తాము ఒకటైనన్న సంకేతాలు ఇస్తుండడం వంటివన్నీ ఏపీలో బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

ఏపీ బీజేపీ నేతలు తరచుగా వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసినా, కేంద్ర బిజెపి పెద్దలు జగన్ తో సఖ్యతగా మెలుగుతూ ఉండడం ఇవన్నీ ఏపీ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.

Telugu Amith Sha, Ap Bjp, Ap Cm Jagan, Ap Mlc, Jagan, Jagan Delhi, Modhi, Somu V

ఏపీలో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతున్నా.టిడిపిని కూడా కలుపుకు వెళ్లాలనే ప్రతిపాదన పవన్ చేస్తున్నారు.అయితే టిడిపి తో కలిసి వెళ్లేందుకు సోము వీర్రాజు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

  అలాగే ఏపీ బీజేపీలోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, తదితర అంశాలను బిజెపి కేంద్ర పెద్దలు సీరియస్ గా తీసుకుంటే.సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు ఏమాత్రం వెనకాడరు .ఏపీ బిజెపి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ( Kanna Lakshminarayana ) ఉన్న సమయంలో బిజెపి పరిస్థితి కొంతవరకు బాగానే ఉన్నట్టుగా కనిపించేది.

Telugu Amith Sha, Ap Bjp, Ap Cm Jagan, Ap Mlc, Jagan, Jagan Delhi, Modhi, Somu V

అయితే ఆయన టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణాలతో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోమ వీర్రాజుకు బాధ్యతలను అప్పగించారు.ఇక అప్పటినుంచి కన్నా లక్ష్మీనారాయణకు వీర్రాజుకు మధ్య అంతర్గతంగా పోరు నడిచేది.బహిరంగంగాను ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది.

ఇక వీర్రాజు వైఖరితో విసిగిపోయిన లక్ష్మీనారాయణ ఈ మధ్యనే టిడిపిలో చేరిపోయారు.ప్రస్తుతం ఏపీ బీజేపీని ప్రక్షాళన చేసి ఎన్నికల నాటికి బలోపేతం చేయాలని బిజెపి అధిష్టానం భావిస్తే వీర్రాజును తప్పించే అవకాశం కనిపిస్తోంది.

ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనేది తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube