ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: డిఎస్ఓ వెంకటేశ్వర్ రావు

నల్లగొండ జిల్లా:మిల్లర్లు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని క్వింటాకు రూ.2400 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిఎస్ఓ వెంకటేశ్వర్ రావు ఆదేశించారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని మహాతేజా లక్ష్మీ రైస్ ఇండస్ట్రీస్ లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నాన్ ఆయకట్టు ప్రాంతాల రైతులు మిల్లుల వద్దకు తెచ్చే ధాన్యాన్ని వర్షాభావ పరిస్థితులను అడ్డుగా పెట్టుకొని ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లు హెచ్చరించారు.మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా రెండు మూడు రోజుల్లో రైతు సంఘం నాయకులు, మిల్లర్లతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్,సబ్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, ధాన్యం కొనుగోలుకు వేగవంతమైన చర్యలు చేపట్టినున్నట్లు తెలిపారు.

జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్,జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ళను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఇప్పటికే 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించామని, ఇప్పటికే 1085 కేంద్రాలను ప్రారంభం కాగా,శుక్రవారం మరో 50 కేంద్రాలు ఓపెన్ చేశానన్నారు.

ఇప్పటి వరకు 7000 క్వింటాల ధాన్యాన్ని కొలుగొను చేయడం జరిగిందన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో గోదాములను అద్దెకు తీసుకొని ధాన్యాన్ని అక్కడికి తరలించడం జరుగుతుందన్నారు.

Advertisement

అక్యూ వెదర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దానిలోని వాతావరణ సూచనలను అనుగుణంగా నిర్వాహకులు ధాన్యం కొనుగోలుకు ప్రాణాళికలు రూపొందించుకోవాలని, రైతులు సైతం దానికి అనుగుణంగా పంట మార్పిడిలు చేపట్టాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో నాలుగు వేయింగ్ మిషన్లను,రెండు మాయిశ్చర్ మిషన్లతో పాటు ఇతర అన్నిరకాల ఏర్పాట్లను చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.ప్రభుత్వం సన్నరకం ధాన్యం విషయంలో రూ.500 బోనస్ ప్రకటించినందున రైతులు 17% తేమతో నాణ్యమైన ధాన్యాన్ని తరలించి గరిష్ట మద్దతు ధర 2320 తో కలపి రూ.2820 ను పొందాలన్నారు.రైతులు తమకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేసినట్లయితే సత్వర సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ కోటేశ్వరి, ఎంపీడీవో శారదా దేవి, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్,అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్,మిల్లర్లు బండారు కుశలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News