క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా నాట్యం సినిమాను తెర‌కెక్కించాం: సంధ్యారాజు

ప్రముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’.

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన‌ విశేషాలు.చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం.

ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి.సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను.

నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు.కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం.

Advertisement

చాలా రీచ్ అయింది.అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది.

అందుకే ఈ సినిమాను తీశాను.నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు.

నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది.నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి.

కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు.నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది.ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు.

Advertisement

పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే.

నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి.గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం.క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం.

వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి.నాట్యం అనేది ఊరి పేరు.

దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి.కమర్షియల్ సినిమాలానే ఉంటుంది.

మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది.మనం వేరే వాళ్లను కాపీ చేస్తే అది కాపీలానే ఉంటుంది.

మనలోని యూనిక్ పాయింట్‌ను తీస్తే అందరూ ప్రశంసిస్తారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ సినిమాను చూశారు.

అభినందించారు.ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు.

కానీ సినిమా మొదలైన తరువాత.పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు.

ఆ తరువాత నన్ను సత్కరించారు.

చిరంజీవి గారు ఇంకా మా సినిమా చూడలేదు.సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది.

మా టీజర్ ఆయన చూశారు.బాగా నచ్చింది.

మమ్మల్ని ప్రశంసించారు.చిన్నప్పుడు అందరి తల్లిదండ్రుల్లానే నన్ను కూడా రకరకాల క్లాసులకు పంపించారు.

పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణను చూసి అక్కడే ఉండిపోయాను.నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

కామర్స్ చదువు, ఫ్యాక్టరీలు చూసుకో అని ఇంట్లోవాళ్లు చెప్పారు.కానీ మనసంతా కూడా నాట్యం మీదే ఉండిపోయింది.

కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నన్ను నిరుత్సాహపరచలేదు.పెళ్లి తరువాత కూడా మెట్టింట్లో వాళ్లంతా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు.

క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశాం.దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం.కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది.

రొహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్.అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయి.

నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది.ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్‌లతో కలిసి పని చేస్తూ వచ్చాను.అలా హీరోయిన్‌లా ఎక్కడా ఉండలేకపోయాను.

సినిమాను పూర్తి చేసి థియేటర్‌కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది.నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు జనాలు మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది.

అలానే ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే.ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రొత్సాహానిచ్చినట్టు అవుతుంది.

నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం.దానికి చాలా ఆదరణ వచ్చింది.

ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు.ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు.

అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చింది.

నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది.కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు.కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి.

కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు.మనలోని భావాలను కూడా పట్టేస్తుంది.

కెమెరాకు ఆ శక్తి ఉంది.మళయాలంలో యూటర్న్ సినిమాను చేశాను.

కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు.ఇక నాట్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది.

వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను.కానీ కమర్షియల్ చిత్రాలను చేయను.

డబ్బులు ఎక్కువగా ఇస్తారు కదా? అని ఏది పడితే అది చేయను.ఆ హీరోతో చేస్తే మార్కెట్ పెరుగుతుందనే స్ట్రాటజీలతో సినిమాలు చేయను.

మంచి కథ, పాత్ర వస్తే చేస్తాను.జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వేస్తాను.

అమ్మాయిలకు లీడ్ కారెక్టర్స్ చేయాలనిపించే పాత్రలే చేస్తాను.

నేను చేసిన షార్ట్ ఫిల్మ్‌కు, ఈ సినిమాకు సంబంధం లేదు.ఇందులో నాట్యం అనే ఊరిలో సితార అనే పాత్రలో కనిపిస్తాను.సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు.

ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని అంటారు.కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారు.

మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు.పెద్ద స్టార్స్‌ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు.

అలా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయింది.మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు.

కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు.ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజా వార్తలు