తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన కేసీఆర్( CM KCR ) ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు.దాదాపు చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు.
టికెట్లు ప్రకటన విషయంలో ఆచితూచి వ్యవహరించారు , గెలుపు గుర్రాలను గుర్తించి వారిని అభ్యర్థులుగా ప్రకటించారు .ఇక ప్రకటించిన అభ్యర్థులకు గత మూడు రోజులుగా బీ ఫామ్ లు పంపిణీ చేస్తున్నారు .ఇప్పటివరకు 105 మందికి బీఫామ్స్ పంపిణీ చేసినట్లు సమాచారం .అయితే మిగిలిన వారికి ఇంకా బీఫాం లు ఇవ్వకపోవడంతో, వారిని అభ్యర్థులుగా తప్పించాలని నిర్ణయించుకున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.ఈనెల 15న 69 మందికి , ఆ తర్వాత రోజు 28 మందికి కెసిఆర్ బి ఫామ్ లు ఇచ్చారు .పెండింగ్ లో ఉన్న వాటిలో ఇప్పటివరకు అభ్యర్థులు ప్రకటించని నరసాపూర్ , గోషామహల్ , నాంపల్లి స్థానాలు కూడా ఉన్నాయి.
వీరిలో కొంతమందిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది .ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం( VM Abraham ) అభ్యర్థిత్వంపై అనుమానాలు మొదలయ్యాయి .అబ్రహం పేరును కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని, అందుకే అబ్రహం తమను కలిసేందుకు ప్రయత్నించినా, కేసీఆర్ కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదట.
కెసిఆర్ బీఫాంలు అందరికీ ఒకేసారి కాకుండా, విడతల వారీగా ఇస్తున్నారు , కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేపట్టే ఉద్దేశంతో కొంతమందికి బి ఫామ్ లు ఇవ్వడం లేదట .స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ఎప్పుడో ప్రకటించినా, ఆయనకు మూడు రోజులపాటు బీఫామ్ ఇవ్వలేదు. గురువారం ప్రగతి భవన్ లో కడియం శ్రీహరికి( Kadiyam Srihari ) బి ఫామ్ ఇచ్చారు .ఇప్పటివరకు అక్కడ తానే అభ్యర్థిగా ఉంటానంటూ ప్రచారం చేసుకుంటున్న రాజయ్య( Rajaiah )కు చెక్ పెట్టారు.
ఈ విధంగా అనేక నియోజకవర్గాల విషయంలో కెసిఆర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.దీంతో ఇప్పటివరకు బీఫామ్ అందుకోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.టికెట్ తమకు వస్తుందా రాదా అనేది క్లారిటీ లేకపోవడంతో టెన్షన్ గా కెసిఆర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.