హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.
సాయంత్రం 6 గంటల లోపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
హెచ్ సీఏ ఎన్నికల్లో నాలుగు ప్యానెల్ లు పోటీ పడుతుండగా 173 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.మొత్తం 149 క్రికెట్ క్లబ్స్ ఉన్నాయి.
సాధారణ మెజార్టీ సాధించేందుకు గానూ 87 ఓట్లు పడాల్సి ఉంటుంది.కాగా హెచ్ సీఏ ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తుండటం గమనార్హం.







