సముద్రగర్భంలో 5,000 సరికొత్త జీవజాతులను కనుగొన్న పర్యావరణ శాస్త్రవేత్తలు!

జీవ వైవిధ్యానికి నిలయం సముద్రాలనే( Sea ) సంగతి మనం చిన్నప్పుడే చదువుకున్నాం.

ఇప్పటికే సముద్రగర్భంలో కొన్ని లక్షల జీవరాశులని కనుగొన్న పర్యావరణ శాస్త్రవేత్తలు, ఇప్పటి వరకు ఎన్నడూ గుర్తించని 5,000 సరికొత్త జీవజాతులను పసిఫిక్ మహా సముద్రగర్భంలో( Pacific Ocean ) తాజాగా కనుగొనడం విశేషం.

విషయం ఏమంటే, కొన్ని మెరైన్ కంపెనీలు మైనింగ్‌ అన్వేషణను ప్రారంభించిన తరువాత పర్యావరణ వేత్తలు, బయాలజిస్టులు తమ అన్వేషణలో భాగంగా క్రూయిజ్‌లపై పసిఫిక్ మహాసముద్ర అడుగు భాగాలకు వెళ్లడం జరిగింది.

ఇక్కడ దాదాపు 5,000 కిలోమీటర్ల వైశాల్యంలో.4 వేల నుంచి 5, 500 మీటర్ల లోతులో విస్తరించి ఉన్న సముద్ర భాగంలోని క్లారియన్ క్లిప్పర్ జోన్ ప్రాంతాన్ని గుర్తించగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్ష కంటే ఎక్కువ జీవ జాతులను రికార్డు చేయడం జరిగింది.ఈ క్రమంలోనే వారు 5 వేల కొత్త జాతులు ఉన్నట్లు అక్కడ గుర్తించారు.

వీటిలో 88 నుంచి 92 శాతం ముందెన్నడూ చూడని జీవజాతులను కనుగొన్నారని తెలుస్తోంది.

Advertisement

ఈ సందర్భంగా నేచురల్ హిస్టరీ మ్యూజియం( Natural history museum )లో పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి మురియల్ రాబోన్ మాట్లాడుతూ.పసిఫిక్ మహా సముద్రంలోని సీసీజెడ్ జోన్‌ తక్కువ సూర్యరశ్మి, తక్కువ ఆహార లభ్యతతో కూడిన ఓ చీకటి ప్రాంతం.కానీ ఇక్కడి నోడ్యూల్ ఫీల్డ్ ఆవాసాలలో బెంథిక్ అకశేరుక జంతుజాలానికి సంబంధించిన విభిన్న సమూహాలు ఉండడం మేము గుర్తించాము.

అని అన్నారు.ఇక్కడ జాతులను గురించి ఆయన వివరిస్తూ.

కొన్ని జాతులు స్పాంజ్‌లు, క్లాసిక్ బాత్ స్పాంజ్‌ల వలె కనిపించాయని, మరి కొన్ని కుండీల వలె కనిపిస్తాయని, వీటిలో గ్లాస్ స్పాంజెస్ అయితే మరీ ఆకట్టుకుంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు