వీడియో: తప్పిపోయిన కోతి పిల్లను మళ్లీ చూసి దాని ఫ్యామిలీ ఎమోషనల్..!

కుటుంబం నుంచి విడిపోయిన కోతి పిల్లను చాలా రోజుల తర్వాత కుటుంబ చెంతకు చేర్చారు రెస్క్యూ టీమ్‌ అధికారులు.

దీంతో ఆ కోతి ఫ్యామిలీ చాలా భావోద్వేగానికి లోనయ్యింది.

మనుషుల లాగానే రియాక్ట్ అవుతూ తప్పిపోయిన తన పిల్లను తల్లి గట్టిగా హత్తుకొని తన ప్రేమను కురిపించింది.ఈ దృశ్యాన్ని చూసిన అటవీ అధికారులు కూడా ఫిదా అయిపోయారు.

దీనికి సంబంధించిన వీడియోని వారు సోషల్ మీడియాలో చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.ఈ ఎమోషనల్ రీయూనియన్ చూసి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

మనుషులకే కాదు జంతువులకు కూడా కుటుంబం అంటే ఇంత ప్రేమ ఉంటుందా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక కోతి పిల్లను వన్యప్రాణుల నిపుణుడు ఒక బాక్స్ లో నుంచి వదిలివేయడం గమనించవచ్చు.

Advertisement

అనంతరం ఆ కోతి పిల్ల ఒక ఇంటి పైకప్పుపై ఉన్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేగంగా పరుగెత్తింది.అయితే మళ్లీ కనిపించదని భావించిన తన కోతి పిల్ల కనిపించగానే తల్లి కోతి దాన్ని హత్తుకునేందుకు పరుగు పరుగున ముందుకు వచ్చింది.

అనంతరం దాన్ని గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతూ తన ప్రేమను కురిపించింది ఇతర కోతులు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి దానికి వెల్‌కమ్‌ చెప్పాయి.ఈ వీడియోను యోడా4ఎవర్ అనే ట్విట్టర్‌ అకౌంట్ పోస్ట్ చేసింది.

ఈ వీడియోకి ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్, 70 వేలకు పైగా లైకులు వచ్చాయి.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు