ఎమోషనల్ అయిన ప్రదీప్..!

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రదీప్ మాచిరాజు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

తనకు ఉన్న పాపులారిటీ తో " 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? " అనే రొమాంటిక్, కామెడీ సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు.ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా వ్యవహరించగా, మున్నా దర్శకుడిగా వ్యవహరించాడు.

ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా నుంచి వచ్చిన " నీలి నీలి ఆకాశం" అనే పాట ప్రేక్షకులలో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.జనవరి 29న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చి డివైడ్ టాక్ తో యావరేజ్ గా అనిపించుకుంది .అంతేకాకుండా సెకండాఫ్ లో 30 నిమిషాలపాటు బాగుంది అంటూ ప్రేక్షకులలో వినిపించింది.ఇదిలా ఒకవైపు ఇస్తాలే ఉండగా మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కాసుల వర్షం కురిపిస్తోంది.

మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి నాలుగు కోట్ల కలెక్షన్స్ ను సాధించిందని అంటే నమ్మండి.ఫస్ట్ సినిమా, అది కూడా ఫస్ట్ డే ఈ రేంజిలో కలెక్షన్స్ రావడం అంటే ఆషామాషీ కాదు.

Advertisement

ప్రదీప్ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు తనదైన రీతిలో ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ లెటర్ ను పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ పోస్టులో ప్రదీప్.

"ఒక చిన్న సినిమాకి ఇంత విశేషంగా స్పందన వచ్చిందని, నా కెరియర్ లోనే అతిపెద్ద అడుగు నేను వేసేటప్పుడు నాకోసం ఇంతమంది సపోర్ట్ ఉండడం ఇంత మంది ప్రజలు థియేటర్స్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.ఎప్పటికి మిమల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధం" అంటూ ప్రదీప్ ఎమోషనల్ అయినట్లు అర్థమవుతోంది.

 ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ, మరోవైపు వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు ప్రదీప్..

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు