నేను నటిస్తే చచ్చిపోయానని ప్రచారం చేశారు.. వైరల్ అవుతున్న ఇమ్మాన్యుయేల్ సంచలన వ్యాఖ్యలు!

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా పాపులర్ అయిన కంటెంట్లలో ఇమ్మాన్యుయేల్( Jabardasth Emmanuel ) ఒకరు కాగా ఈ కమెడియన్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇమ్మానుయేల్ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు.

బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి.ఈ వెబ్ సిరీస్ క్లైమాక్స్ లో ఇమ్మాన్యుయేల్ పాత్ర చనిపోతుంది.

అయితే కొన్ని ఊరూపేరు లేని యూట్యూబ్ ఛానెళ్లు ఇమ్మాన్యుయేల్ రీల్ లైఫ్ లో చనిపోతే రియల్ లైఫ్ లో చనిపోయినట్టుగా థంబ్ నైల్స్ పెట్టి ప్రచారం చేశాయి.వ్యూస్ కోసం మరీ హద్దులు దాటి యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేయడం గమనార్హం.వర్ష ఏడుస్తున్నట్టు ఉన్న ఆ థంబ్ నైల్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ కావడం గమనార్హం.

నేను నటిస్తే చచ్చిపోయానని రాశారని ఇమ్మాన్యుయేల్ అన్నారు.

Advertisement

నేను నటిస్తే చచ్చిపోయానని ప్రచారం చేస్తారా అంటూ ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం గమనార్హం.నేను చావలేదని ఆ సీన్ ప్రేమ వాలంటీర్ సినిమాలోని సీన్ అని ఇమ్మాన్యుయేల్ అన్నారు.ఇమ్మాన్యుయేల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇమ్మాన్యుయేల్ కమెడియన్ గానే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా నటుడిగా ఎదుగుతున్నారు.ఇమ్మాన్యుయేల్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉండగా ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా ఇమ్మాన్యుయేల్ మాత్రం ఈటీవీ ఛానల్ కు పరిమితం కావడం గమనార్హం.

ఇమ్మాన్యుయేల్ రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఇమ్మాన్యుయేల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు