చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు ( elephants_ )బీభత్సం సృష్టించాయి.గజరాజులు సృష్టించిన విధ్వంసంలో వరి, టమాట, మామిడి పంటలు ధ్వంసం అయ్యాయి.

కుప్పం మండలంలోని వెండుగంపల్లి, నడుమూరు, వసనాడు మరియు ఉర్ల ఓబనపల్లి పరిసరాల్లో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి.గత రెండు రోజులుగా మండలంలోని పలు ప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి.

ఈ క్రమంలో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఉర్ల ఓబనపల్లి సమీపంలోని మామిడితోటలో రెండు ఏనుగులు తిష్ట వేశాయి.

దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
వైరల్ వీడియో : మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం.. గాల్లో ఉండగా విమానం పైకప్పు ఓపెన్..

తాజా వార్తలు