వైరల్ వీడియో: మనుషులే కాదండి... ఏనుగులు కూడా స్వచ్చ భారత్ ను ఎంత బాగా పాటిస్తున్నాయో చూడండి....!

మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.అలాగని బయట ఎలా పడితే అలా చెత్తను పారేస్తే ఎలా…? దేశం కూడా మనదే కదా.దేశం బాగుంటేనే మనం బాగుంటాము.మన ఇల్లు మనం శుభ్రంగా ఉంటే చాలు బయట ఎలా ఉంటే నాకేంటి అని అనుకునే మనుషులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు.

 Elephant Picks Waste And Puts In Dustbin Viral Video,elephant, Swachh Bharat , I-TeluguStop.com

ఎలా ఎవరికి వారు అనుకుంటే వాతావరణం కలుషితం అయ్యి చివరికి అనారోగ్యాల పాలవుతారు.మనలో కొంతమంది పక్కనే చెత్త బుట్ట ఉన్నాగాని అందులో చెత్త వెయ్యడానికి బద్దకించి కింద పడేస్తూ ఉంటారు.

ఆ నాకెందుకులే ఎవరో ఒకరు తీస్తారు అని అనుకుంటారు.

నిజానికి అది చాలా తప్పు అని ఒక నోరు లేని మూగ జీవి నిరూపించింది.

అవును మీరు విన్నది నిజమే ఓ ఏనుగు చేసిన పనికి యావత్ ప్రపంచం జేజేలు కొడుతుంది.అది చూస్తే మీరు కూడా ఆ ఏనుగును మెచ్చుకోకుండా ఉండలేరు.

మూగ జీవాలు సైతం స్వచ్ఛభారత్ పాటిస్తున్నాయి అనటానికి ఈ ఏనుగు సాక్షం.ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో బాగా ఫేమస్ అయింది.

ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక ఏనుగు తినడానికి ఎమన్నా దొరుకుతాయేమోనని ఒక ఇంటి దగ్గర ఉన్న చెత్త బుట్ట దగ్గరకు వచ్చింది.

అయితే అందులే ఏమీ కనిపించలేదు.అందులోంచి ఓ చుట్టి ఉన్న కాగితాన్ని బయటకు తీసిన ఏనుగు దాన్ని జాగ్రత్తగా మళ్లీ అందులోనే వేసింది.అంతే కాదు, ఆ పక్కన గడ్డిలో ఉన్న మరో చెత్తను కూడా జాగ్రత్తగా చెత్త బుట్టలో వేసింది.ఇందుకు తన కాలు, తొండాన్ని ఉపయోగించింది.

ఇలా ఆ ఏనుగు బాస్కెట్‌ లో పేపర్ వేసి…ప్రతి ఒక్కరు స్వచ్ఛత, శుభ్రతా పాటించాలనే విషయాన్ని ఏనుగు గుర్తుచేస్తుంది.అందుకే నెటిజన్లు ఆ గజాన్ని మెచ్చుకుంటున్నారు.

అది స్వచ్ఛభారత్ ఏనుగు అంటున్నారు.ఈ మధ్య ఏనుగులు, చిరుతలు, ఇతర వన్య మృగాలు చేసే పనులకు ప్రజల దగ్గర నుండి విశేష స్పందన వస్తుంది.

ఈ కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరం శుభ్రత పాటిస్తే కరోనాను తరిమి వేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube