వైరల్ వీడియో: మనుషులే కాదండి… ఏనుగులు కూడా స్వచ్చ భారత్ ను ఎంత బాగా పాటిస్తున్నాయో చూడండి….!

మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.అలాగని బయట ఎలా పడితే అలా చెత్తను పారేస్తే ఎలా.

? దేశం కూడా మనదే కదా.దేశం బాగుంటేనే మనం బాగుంటాము.

మన ఇల్లు మనం శుభ్రంగా ఉంటే చాలు బయట ఎలా ఉంటే నాకేంటి అని అనుకునే మనుషులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు.

ఎలా ఎవరికి వారు అనుకుంటే వాతావరణం కలుషితం అయ్యి చివరికి అనారోగ్యాల పాలవుతారు.

మనలో కొంతమంది పక్కనే చెత్త బుట్ట ఉన్నాగాని అందులో చెత్త వెయ్యడానికి బద్దకించి కింద పడేస్తూ ఉంటారు.

ఆ నాకెందుకులే ఎవరో ఒకరు తీస్తారు అని అనుకుంటారు.నిజానికి అది చాలా తప్పు అని ఒక నోరు లేని మూగ జీవి నిరూపించింది.

అవును మీరు విన్నది నిజమే ఓ ఏనుగు చేసిన పనికి యావత్ ప్రపంచం జేజేలు కొడుతుంది.

అది చూస్తే మీరు కూడా ఆ ఏనుగును మెచ్చుకోకుండా ఉండలేరు.మూగ జీవాలు సైతం స్వచ్ఛభారత్ పాటిస్తున్నాయి అనటానికి ఈ ఏనుగు సాక్షం.

ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో బాగా ఫేమస్ అయింది.ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు.

ఈ వీడియోలో ఒక ఏనుగు తినడానికి ఎమన్నా దొరుకుతాయేమోనని ఒక ఇంటి దగ్గర ఉన్న చెత్త బుట్ట దగ్గరకు వచ్చింది.

అయితే అందులే ఏమీ కనిపించలేదు.అందులోంచి ఓ చుట్టి ఉన్న కాగితాన్ని బయటకు తీసిన ఏనుగు దాన్ని జాగ్రత్తగా మళ్లీ అందులోనే వేసింది.

అంతే కాదు, ఆ పక్కన గడ్డిలో ఉన్న మరో చెత్తను కూడా జాగ్రత్తగా చెత్త బుట్టలో వేసింది.

ఇందుకు తన కాలు, తొండాన్ని ఉపయోగించింది.ఇలా ఆ ఏనుగు బాస్కెట్‌ లో పేపర్ వేసి.

ప్రతి ఒక్కరు స్వచ్ఛత, శుభ్రతా పాటించాలనే విషయాన్ని ఏనుగు గుర్తుచేస్తుంది.అందుకే నెటిజన్లు ఆ గజాన్ని మెచ్చుకుంటున్నారు.

అది స్వచ్ఛభారత్ ఏనుగు అంటున్నారు.ఈ మధ్య ఏనుగులు, చిరుతలు, ఇతర వన్య మృగాలు చేసే పనులకు ప్రజల దగ్గర నుండి విశేష స్పందన వస్తుంది.

ఈ కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరం శుభ్రత పాటిస్తే కరోనాను తరిమి వేయొచ్చు.

అమానుషం.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టరమ్మ..