ఎన్నికల నోటిఫికేషన్ విడుదల .. నేటి నుంచే నామినేషన్లు 

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule )విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యాయి.బస్సు యాత్రలలు, సభలు సమావేశాలతో ఎన్నికల ప్రచార వేడిని మరింతగా పెంచుతున్నారు.

 Election Notification Release Nominations From Today, Ap Elections, Jagan, Chan-TeluguStop.com

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతుండగా, ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ( Parliament and Assembly in AP ) కి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీలన్నీ జనాలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల ప్రచారాలు చేపట్టాయి.

ఇదిలా ఉంటే .తాజాగా నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువబడింది.ఏపీ, ఒడిశా ,అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ తో సహా 10 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

Telugu Ap, Ap Telangana, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Ysrcp-Polit

నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు ( Lok Sabha Elections )జరిగే రాష్ట్రాల్లో ఏపీ,  తెలంగాణ , బీహార్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ము కాశ్మీర్ లు ఉన్నాయి.వీటిలో మొత్తం 96 లోక్ సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి .ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో , నేటి నుంచి తెలంగాణ ,ఏపీ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.

Telugu Ap, Ap Telangana, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Ysrcp-Polit

ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.26న వాటిని పరిశీలిస్తారు.29 వరకు ఉపసంహరణకు గడువును విధించారు.మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు  కలెక్టరేట్ల లో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాలలో నామినేషన్ పత్రాలు సమర్పించాలి .లోక్ సభ అభ్యర్థి 25, 000 శాసనసభ అభ్యర్థి 10,000 డిపాజిట్ గా చెల్లించాలి.ఎస్సీ ,ఎస్టీలు దీనిలో 50% చెల్లిస్తే సరిపోతుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube