యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ పై ఎలక్షన్ కమీషన్ వేటు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్‌ (రెవెన్యూ) భాస్కరరావు( Additional Collector Bhaskara Rao )పై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఎన్నికల కమిషన్‌ ( Election Commission )ఆదేశాలతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నల్గొండ,జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో( Yadadri Bhuvanagiri ) నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తూ ఇంకా మూడేళ్లు పూర్తి కాలేదని తప్పుడు నివేదిక ఇవ్వడంతో విచారణ జరిపిన ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది.

Latest Yadadri Bhuvanagiri News