ఆ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ! ?

అన్ని పార్టీలు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు( Telangana Assembly Elections ) సంబంధించిన షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడింది.

ఈ మేరకు భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.

అక్టోబర్ మొదటి వారంలో ఈసీ అధికారుల బృందం నిర్వహించే సమీక్ష సమావేశం తరువాత షెడ్యూల్ ను విడుదల చేయబోతున్నారట.ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీ అధికారుల బృందం అక్టోబర్ మూడు నుంచి హైదరాబాదులో( Hyderabad ) పర్యటించనుంది.

ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం ,అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 అక్టోబర్ 6 న విడుదల కాగా,  డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే తరహాలో జరగబోతున్నట్లుగా అంతా అంచనా వేస్తున్నారు.షెడ్యూల్ ప్రకటనకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో, అన్ని రాజకీయ పార్టీలు ముందుగానే అలెర్ట్ అవుతున్నాయి.

Advertisement

ఇప్పటికే బీఆర్ఎస్( BRS ) తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీలు మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ఇక అన్ని పార్టీల నాయకులు ప్రజలకు దగ్గర అయ్యేందుకు,, వారి ఓట్లు తమ పార్టీ కే పడేటట్లు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసారు.అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిస్థాయిలో  ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక భారీగా ర్యాలీలు,  సభలు సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరించే విధంగా ప్లాన్ చేస్తున్నారు .ఈసారి జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగితేలుతున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు