ఎవరైతే బాగుంటుందో ..? ఆరా తీస్తున్నారుగా ?

తెలంగాణ కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఆ పార్టీ అధిష్టానం పెద్దలు కసరత్తు మొదలు పెట్టారు.  అసలు ఎప్పుడో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉన్నా, అధిష్టానం పెద్దలు రకరకాల కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

 Efforts By Congress Central Leaders For The Election Of New Pcc President, Telan-TeluguStop.com

ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి వల్ల పెద్దగా ఉపయోగం లేదని, కొత్త అధ్యక్షుడి నియమిస్తే కానీ కాంగ్రెస్ కు తిరిగి పునర్వైభవం రాదు అనే అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో బాగా ఉంది.అయితే ఈ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం పెద్దలు ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నారు.

అయితే ఆయన పేరును ఎంపిక చేస్తే మిగిలిన కాంగ్రెస్ సీనియర్ల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉంటుంది అనే విషయాన్ని గుర్తించిన అధిష్టానం పెద్దలు అనవసరంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతుందనే అభిప్రాయంతో ఇప్పటి వరకు వాయిదాలు వేసుకొంటూ వచ్చారు.
  ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా పార్టీని ప్రక్షాళన చేయాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం దానిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు తీసుకురావాలని,  కొత్త పిసిసి అధ్యక్షుడు తో పాటు అన్ని కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేసి ,పార్టీకి జీవం పోయాలని చూస్తోంది.

దీనిలో భాగంగానే రేవంత్ తో పాటు,  జానారెడ్డి పేరును పరిగణనలోకి తీసుకున్నా, ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేను అంటూ ప్రకటించారు.

Telugu Congress Senior, Jana, Komati Venkata, Mallubatti, Pcc, Revanth Reddy-Tel

ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకుల పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
  అయితే వీరిలో ఎవరు అయితే పార్టీకి మేలు జరుగుతుంది ఎవరు పార్టీని అధికారంలోకి తీసుకు రాగలరు ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్య నాయకుల ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం.అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

అధిష్టానం ఈ విషయంలో దూకుడుగా ఉన్నట్లు తేలడంతో ఎవరికివారు తమకు అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకోవడం తో పాటు , తమకు జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube