తెలంగాణలో మరల వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అప్పటి పరిస్థితులపై ఒక అవగాహనకు వచ్చి ఎవరిని బరిలోకి దింపాలి, ఎవరిని బరిలోకి దింపకూడదు అనే విషయం పై ఇప్పటి నుండే కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరుపై రహస్య నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం.
ప్రజల్లో వారి వారి నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఒక క్లారిటీ తెచ్చుకొని అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్.అయితే కేసీఆర్ దగ్గర ఉన్న ఈ రహస్య నివేదికను బహిర్గతం చేసే ఆలోచన కేసీఆర్ కు లేకున్నా భవిష్యత్తులో జరిగే మార్పులు చేర్పులు ఈ నివేదిక ఆధారంగానే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే గత ఎన్నికల్లో ఇటు బీజేపీకి, కాంగ్రెస్ కు టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటైన అభ్యర్థులు దొరకకపోవడంతో టీఆర్ఎస్ కు కొంత లాభం చేకూరింది.
కాని ఇప్పుడు పరిస్థితి మాత్రం అప్పటి పరిస్థితి కంటే పూర్తి భిన్నంగా ఉంది.
ఖచ్చితంగా 119 నియోజకవర్గాలలో ప్రతి చోట టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురుకానుంది.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే కెసీఆర్ ముందస్తు వ్యూహరచన చేస్తున్నారు.మరి భవిష్యత్తులో కెసీఆర్ ఎలాంటి మార్పులు చేస్తారనేది చూడాల్సి ఉంది.