గత కొన్ని రోజులుగా బిజెపిలో( BJP ) వ్యవస్థాకృతంగా జరుగుతున్న కొన్ని మార్పులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.బిజెపిలో అసంతృప్తినేతగా గత కొన్ని రోజులుగా చెప్పబడుతున్న ఈటెల రాజేందర్( Etela Rajender ) హస్తిన ప్రయాణం తర్వాత తన మార్కు రాజకీయాలకు తెర తీశారు.
బిజెపిలో ఇప్పటివరకు మౌనంగా కొనసాగిన ఈ నేత ఒకసారి ఢిల్లీ నుంచి రాగానే తెలంగాణ ప్రజానీకానికి హామీల వర్షం కురిపించారు.ఎన్నికల కమిటీ చైర్మన్గా నియమించబడిన ఈటెల ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి( CM Candidate ) ఇవ్వాల్సిన హామీలను ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చ మొదలైంది.
ఈటెలకు భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కేంద్రం బిజెపి హామీ ఇచ్చిందా అన్న విశ్లేషణలు వస్తున్నాయి .
ముఖ్యం గా ఆయన ఇచ్చిన హామీలు చూస్తే దంపతులతో ఒకరికి మాత్రమే పెన్షన్ వచ్చే విధానాన్ని తీసివేసి ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రతి కుటుంబానికి ఫ్రీగా అందేలా చూస్తామని, డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సంతృప్తి పరస్థాయిలో నిర్మిస్తామని,ధరణి పోర్టల్ లో( Dharani Portal ) సమూల మార్పులు చేస్తామని ఇలా కీలకమైన హామీలను ఈటెల రాజేందర్ ఇచ్చారు.

ఆయన ఈ హామీలను ఎన్నికల కమిటీ చైర్మన్గా ఇచ్చారా భవిష్యత్తు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇచ్చారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ముఖ్యంగా బీసీ వర్గాలలో కీలకమైన ఆదరణ ఉన్న ఈటెలను ముందుకు పెట్టి బిజెపి రాజకీయం చేస్తున్నదని, కిషన్ రెడ్డిని( Kishan Reddy ) నామమాత్రపు ఉపాధ్యక్షుడిగా పెట్టి బాధ్యతలను అధికారాలను ఈటలకు కట్టబెట్టిందని ఆ హామీల ధైర్యంతోనే ఆయన ఇలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక తెలంగాణ బిజెపిలో ఈటెల హవా మొదలవుతుందని ఆయన ప్రణాళికల ప్రకారమే తెలంగాణ బిజెపి నడుస్తుందని వార్తలు వస్తున్నాయి.కేసీఆర్( KCR ) గుట్టుమట్లు, వ్యూహ ప్రతి వ్యూహాలు పూర్తిగా తెలిసిన మనిషిగా వాటికి చెక్ పెట్టేందుకు ఈటెల సరైన వ్యక్తి అని బిజెపి నమ్ముతుందని అందుకే ఆయనకు ఎన్నికల నిర్వహణలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని విశ్లేషణలు వస్తున్నాయి మరి కేసీఆర్ లాంటి రాజకీయ భీష్ముడి ని ఎదుర్కొనే సత్తా ఈటెలకు ఉందో లేదో మరికొన్ని ప్రజల్లో ఒక అంచనాకొచ్చే అవకాశం ఉంది.







