తక్కువ సినిమాలే చేసినా తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అరవింద స్వామి( Aravind swamy ) ఒకరు.అరవింద స్వామి రెమ్యునరేషన్( Remuneration ) సైతం భారీ స్థాయిలో ఉంది.
ఇటీవల కస్టడీ సినిమాతో మరోసారి అరవింద స్వామి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అరవింద స్వామి నటించడం వల్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

అరవింద స్వామి మొత్తం అస్తుల విలువ ఏకంగా 4000 కోట్ల రూపాయలు అని భోగట్టా.ఒక్క కంపెనీ ద్వారానే ఈ స్టార్ హీరో 3,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని సొంతం చేసుకున్నారని ఆ కంపెనీ పేరు ట్యాలెంట్ మ్యాక్సిమమ్( Talent maximum ) అని సమాచారం.అరవింద స్వామికి సొంతంగా ఆస్పత్రులు ఉండగా ఆ ఆస్పత్రుల ద్వారా సైతం కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతమవుతోందని తెలుస్తోంది.
అరవింద స్వామి కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.
క్లాస్ రోల్స్ అయినా, మాస్ రోల్స్ అయినా మెప్పించే విషయంలో ఈ స్టార్ హీరో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.అరవింద స్వామి పారితోషికం 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
ఒకవైపు వ్యాపారాల్లో మరోవైపు నటుడిగా సక్సెస్ సాధించడం అరవింద స్వామి విషయంలోనే జరుగుతోంది.

భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని పెంచుకుంటున్న అరవింద స్వామి ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.అరవింద స్వామి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.అరవింద స్వామికి రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కోలీవుడ్ ప్రముఖ నటుడు అరవింద స్వామిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







