కవిత కు ఈడి నోటీసులు ! అరెస్ట్ తప్పదా ? 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు గత కొద్ది రోజులుగా మారుమోగుతూనే ఉంది .

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పాత్ర ఉన్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేశారు.

ఈనెల తొమ్మిదో తేదీన విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు జారీ చేశారు.అలాగే ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో పదో తేదీన హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కవితను విచారణ పేరుతో పిలిచి , అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది .ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.  ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సిబిఐ ఈడి అధికారులు స్పీడ్ పెంచారు.

ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందనుకున్న వారందరికీ వరుసగా నోటీసులు ఇవ్వడంతో పాటు,  అరెస్టులు చేస్తున్నారు.

Advertisement

 అలాగే నిన్న అరెస్ట్ అయిన హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్ళై ను కూడా నేడు ఈడి అధికారులు విచారించబోతున్నారు.రామచంద్ర పిళ్లే అరెస్టు సందర్భంగా జారీచేసిన చార్జిషీట్ లోనూ కవిత పేరును అధికారులు ప్రస్తావించారు.అలాగే తాను కవిత భినామినే అంటూ రామచంద్ర పిల్లే ఒప్పుకున్నట్లు సమాచారం.

పక్కగా అన్ని ఆధారాలను సిబిఐ , ఈడి అధికారులు సేకరించే ఇప్పుడు కవితను విచారణ కు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించినట్లుగా అర్థమవుతుంది.ఇదిలా ఉంటే ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కవిత ధర్నా చేయాలని ముందుగా నిర్ణయించుకున్నారు.

దీని ద్వారా బిజెపిని ఇరుకున పెట్టాలని, బీఆర్ఎస్ ప్రభావాన్ని జాతీయస్థాయిలో చాటి చెప్పాలని కవిత భావించారు.కానీ అదే రోజు విచారణకు రావలసిందిగా ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడంతో,  కవిత విచారణకు హాజరవుతారా లేక ధర్నా కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తారనేది తేలాల్సి ఉంది.ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం బయటపడిన తర్వాత టిఆర్ఎస్ కూడా అలెర్ట్ అయింది.

ఒకవేళ ఈ కేసులో కవితను అరెస్ట్ చేస్తే రాజకీయంగా దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంపై కొద్దిరోజుల క్రితమే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీలోని కీలక నాయకులతో సమావేశం కూడా నిర్వహించారు.తాజాగా జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో కవిత అరెస్టు అయితే,  రాజకీయంగా లబ్ధి పొందేందుకు తమపైన బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని,  అందుకే లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితను ఇరికించి అరెస్ట్ చేశారనే వాదనను జనాల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో సెంటిమెంటును రగిలించి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే వ్యూహంతో టిఆర్ఎస్ ఉందట.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు