చెర్రీపై ప్రశంసలు కురిపించిన ఉపాసన.. ఈ ఏడాది తనదే అంటూ?

టాలీవుడ్ క్యూట్ కపుల్ ఉపాసన, రామ్ చరణ్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుండగా మరోవైపు ఉపాసన హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

 Upasana Konidela Kamineni Says This Year Is All About Her Husband Ram Charan Det-TeluguStop.com

కాగా చెర్రీ ఉపాసనలు కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఉపాసన కూడా తన భర్తతో పాటు వెన్నంటే ఉంటూ తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా చూసుకుంటూ ఉంటుంది.

రామ్ చరణ్ ఇతర విదేశాలకు వెళ్లిన ప్రతిసారి కూడా ఉపాసన కూడా రామ్ చరణ్ తో పాటు వెళుతూ ఉంటుంది.ఇటీవల ఫారెన్లో జరిగిన ప్రతీ ఈవెంట్లో ఇంటర్య్వూలో, అలాగే ఇంటర్నేషనల్ అవార్డు సెర్మనీలో కూడా చెర్రీతో పాటు అక్కడే ఉన్నారు ఉపాసన.ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.ఆ ట్వీట్ లో ఉపాసన ఈ విధంగా రాసుకొచ్చింది.నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో రామ్ చరణ్ నాకు మద్దతుగా నిలిచారు.అలాగే నేను చెర్రీకి అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటాను.

నాటు నాటు సాంగ్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లినప్పుడైనా.ఇంట్లో ఉన్నా.

అలాగే షూటింగ్ అంటూ బిజీగా గడుపుతున్నప్పుడైనా ఇలా ప్రతి విషయంలోనూ నేను చెర్రీకి వెన్నంటే ఉన్నాను.

ఎలాంటి సందర్భంలో అయినా తనకు నేను శాయశక్తుల సాయం చేస్తుంటాను.ఇక చెర్రీకి ఈ ఏడాది చాలా ఆనందాన్ని ఇచ్చింది.తన వర్క్ పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నాడు.

ఈ సంవత్సరం చరణ్ ఎన్నో ప్రసంశలు అందుకున్నారు.ఈ ఏడాది తనదే అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.

ఇకపోతే ప్రస్తుతం ఉపాసన గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే.మెగా వారసుడు కోసం అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube