ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ను విచారించేందుకు ఈడీ అధికారులు చంచల్ గూడ జైలుకు చేరుకున్నారు.
కాగా నందకుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ రెండో రోజు రికార్డ్ చేయనుంది.ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అభిషేక్ తో ఏ విధంగా పరిచయాలు ఉన్నాయనే దానిపై ఈడీ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు.
అయితే రోహిత్ రెడ్డితో గతంలో ఎలాంటి లావాదేవీలు జరిపారో స్టేట్ మెంట్లో అధికారులు రికార్డ్ చేయనున్నారు.