తెలుగు బుల్లితెరపై రోజు రోజుకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు షోలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు ఇలా ఎన్నో రకాల కామెడీ షోలు వచ్చిన విషయం తెలిసిందే.
వీటితోపాటుగా కొత్త కొత్త షోలు పుట్టుకొస్తున్నాయి.ఎంటర్టైన్మెంట్ షోలో మాత్రమే కాకుండా డాన్స్ షోలలో కూడా ఈ మధ్య కాలంలో కామెడీ బాగానే వర్కౌట్ అవుతుందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా మొదలైన షో బిగ్ బాస్ జోడి.ఈ డాన్స్ షోలో డాన్స్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే ఎపిసోడ్ వన్ లో ఇచ్చిన విషయం తెలిసిందే.
మొదటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు జోడీలుగా ఎంట్రీ ఇచ్చి డాన్స్ పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు.ఈ షో కి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ షో కి సీనియర్ హీరోయిన్ రాధ, సీనియర్ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, హీరోయిన్ సదా లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.ఈ షో ప్రతి శని ఆదివారాలలో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.అందులో ఒక్కొక్క జంట వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో అదరగొట్టడంతో తరుణ్ మాస్టర్ రెండు మూడు జంటల పర్ఫామెన్స్ కి పేపర్లు కూడా విసిరేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జడ్జిమెంట్ సమయంలో అవినాష్ సూపర్ స్టార్ కృష్ణ ని ఇమిటేట్ చేస్తూ రాదని పలకరించడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది.
సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన రాధ ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయింది.దాంతో స్టేజి పైన ఎమోషనల్ అయింది.రాధ తోపాటు అక్కడే ఉన్న కొందరు కంటెస్టెంట్లు కూడా కన్నీరు పెట్టుకున్నారు.
కాగా ఇటీవల సూపర్ సార్ కృష్ణ అనారోగ్యం కారణంతో మరణించిన విషయం తెలిసిందే.ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ ని కడసారి చూసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు.