ఎన్నికలకి మరో 5 నెలల సమయం ఉన్న తరుణంలో మరో సారి ఏపీలో ఈడీ స్పీడు పెంచింది.కొన్ని నెలల క్రితం చంద్రబాబు టార్గెట్ గా చేసుకుని ఏపీలో టీడీపీ నేతల పై జరిగిన ఈడీ దాడులు టీడీపీ నేతలని ఎంత టెన్షన్ పెట్టించిందో వేరే చెప్పనవసరం లేదు.
చివరికి ఎక్కడ సీబీఐ ఎటాక్స్ జరుగుతాయో నని భయపడి చంద్రబాబు నాయుడు సీబీఐ ని ఏపీ నుంచీ రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది.అయితే పూర్తిగా చంద్రబాబు తెలంగాణా ఎన్నికలపై దృష్టి పెడుతూ అక్కడి రాజకీయాలలో తలమునకలై ఉన్న తరుణంలో.

ఈడీ మళ్ళీ జూలు విదిల్చింది.సిఎం రమేష్ పై జారిన దాడికే బాబు కి షేక్ అవ్వగా ఇప్పుడు ఏకంగా బాబు కి అత్యంత సన్నిహితుడు.మరో ముఖ్య అనుచరుడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు నివాసాలపై ఈడీ సోదాలు చేస్తోంది.ఈ ఉదయం నుంచే జూబ్లీహిల్స్ లో ఉన్న సుజనా చౌదరి నివాసంలో ఏకధాటిగా సోదాలు నిర్వహిస్తున్నారు.
అంతేకాదు సుజనా బంధువుల ఇళ్లపై కూడా సోదాలు జరుగుతున్నాయి.పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్‌లో ఉన్న ఆయన కంపెనీలపై కూడా సోదాలు చేసి కీలక సమాచారం రాబతినట్టుగా తెలుస్తోంది.
ఇదిలాఉంటే ఆ ఒక్క ప్రాంతంలోనే కాకుండా సోదాలు ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నట్లు గా తెలుస్తోంది అయితే సుజనా ఆస్తులపై ఆయన కంపెనీలపై దాడులు జరగడాన్ని టీడీపీ నేతలు ఖండించారు.టీడీపీపై కక్ష కట్టిన కేంద్రం తమ నేతలని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల సమయంలో తమని ఆందోళనలో కి నెట్టాలని చూస్తోందని ఆపార్టీ నేతలు కేంద్రం చర్యలని తప్పుబట్టారు.

చంద్రబాబు కేంద్రంలో కీలకంగా మారబోతున్నారని.గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు మోడీ వ్యతిరేక శక్తులని కూడగట్టడం తో మోడీ కి గుబులు రేగుతోందని అందుకే ఈ రకమైన దాడులకి తెగబడుతున్నారని ఫైర్ అవుతున్నారు.సీబీఐ కి ఏపీలో నో ఎంట్రీ పెట్టిన కారణంగానే కేంద్రం ఈడీ ని రంగంలోకి దించి ఉంటుందే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.ఏది ఏమైనా సరే ఎన్నికల సమయంలో ఈ రకమైన దాడులు బాబు చరిష్మాకి స్పీడు బ్రేకర్లు అవుతాయని అంటున్నారు పరిశీలకులు.