‘టాక్సీవాలా’ డైరెక్టర్‌కు 'సారీ' చెప్పిన అల్లు అర్జున్..! ఎందుకో తెలుస్తే ఫిదా అవుతారు!

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకిృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టాక్సీవాలా’.శనివారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

 Allu Arjun Said Sorry To Taxiwala Movie Director-TeluguStop.com

క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ థ్రిల్ చేస్తోంది.ఇప్పటి వరకూ 25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి జోరుగా రైడ్ చేస్తోంది.

చూస్తుంటే ఈ వీకెండ్‌లో ఈ జోరు ఇంకా పెరిగేలా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

గీత ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా నటించగా.మాళవిక నాయర్ ముఖ్య పాత్ర పోషించింది.

ఇది ఇలా ఉంటె…‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ మూవీ టెక్నీషియన్లు అందరినీ పేరుపేరునా పలకరించి, వారి గురించి మాట్లాడారు.

‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో తన గురించి ప్రస్తావించలేదని, టాక్సీవాలా సక్సెస్‌ పార్టీలో బన్నీసార్‌ నాకు సారీ చెప్పారు.సినిమాకు కీలకమైన వ్యక్తి దర్శకుడని, అలాంటిది నీపేరు మరిచిపోయిందనుకు సారీ చెబుతున్నానని’ బన్నీ మాటలను ఓ కార్యక్రమంలో రాహుల్‌ వివరించాడు.

గతంలో ‘పెళ్లిచూపులు’, ‘మహానటి’ సినిమాలు విజయం సాధించిన తర్వాత బన్నీ ఆ మూవీ యూనిట్‌కు సక్సెస్‌ పార్టీని ఇచ్చారు.ఇటీవల హిట్‌ కొట్టిన విజయ్‌ దేవరకొండ మూవీ టాక్సీవాలా యూనిట్‌కు అదే తరహాలో సక్సెస్‌ పార్టీ నిర్వహించారు.ఈ వేడుకలో బన్నీ తనకు క్షమాపణ చెప్పారని టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube