వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా తాటి ముంజులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి.వేసవి కాలంలో ఈ తాటి ముంజులకు బాగా డిమాండ్ ఉంటుంది.
ఎందుకంటే వేసవి తాపాన్ని తగ్గించడంలో తాటి ముంజుల పాత్ర చాలా ప్రత్యేకం అనే చెప్పాలి.వేసవిలో ఎండ వేడిమి అధికంగా ఉండడం వలన మన శరీరం ఆ వేడిని తట్టుకోలేదు.
ఆ వేడిని తట్టుకుని, శరీరానికి తక్షణ శక్తి ఇవ్వాలంటే తాటి ముంజులు వేసవి కాలంలో ప్రతి రోజు తినాలి.ఇవి శరీరానికి బాగా చలువ చేస్తాయి.
అందుకే వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటూ ఉంటారు.ఇవి చూడడానికి జెల్లీల మాదిరిగా ఉంటాయి.
చేత్తో పట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా ఉంటాయి ఈ తాటి ముంజులు.
మరి వేసవి కాలంలో ఈ తాటి ముంజులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా.
తాటి ముంజులు ఎన్నితిన్నా గాని ఆరోగ్యానికి చాలా మంచిది.తాటి ముంజులలో క్యాలరీలు తక్కువగాను, శక్తి ఎక్కువగాను ఉంటుంది.శరీరంలో వేడి వలన కలిగే అన్నీ సమస్యలకు తాటి ముంజలతో చెక్ పెట్టవచ్చు.సాధారణంగా ఎండాకాలంలో ఎండ దాటికి శరీరం అంతా డీహైడ్రేట్ అయిపోతుంది.
అలా డీహైడ్రేషన్ అవ్వకుండా శరీరాన్ని హైడ్రెట్ చేయాలంటే తాటిముంజలు తినాలి.అలాగే మనం శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలు తాటి ముంజులలో పుష్కలంగా ఉంటాయి.
వీటితో పాటు విటమిన్ బి, ఐరన్, కాల్షియం కూడా తాటి ముంజల్లో ఉంటాయి.తాటి ముంజుల రుచి కూడా చాలా బాగుంటుంది.
ఇవి తినడానికి కూడా చాలా రుచికరంగా, లేత కొబ్బరి రుచి మాదిరిగా ఉంటాయి.
వేసవిలో వచ్చే ఈ తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తింటే లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.
అలాగే బరువు తగ్గాలని భావించేవారు రోజు తాటి ముంజలు తినడం వలన శరీరంలోని చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.మరి ముఖ్యంగా వేసవిలో గర్భిణులు కచ్చితంగా తాటి ముంజులను తినాలి.
ఇవి జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.ఫలితంగా మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు.
వేసవి కాలంలో చికెన్ పాక్స్ వంటి వ్యాధుల బారిన పడిన వారు తాటి ముంజులు తింటే మంచిది.తాటి ముంజలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి.
తాటి ముంజులను గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా రాసుకుంటా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.అలాగే తాటి ముంజులలో ఉండే నీటిని ముఖానికి రాసుకుంటే అవి చర్మానికి కావల్సిన తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటపొక్కుల్ని నివారిస్తాయి.
అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను కూడా పోతాయి.







