'RC15' నుండి చరణ్ పిక్ లీక్.. షాక్ ఇస్తున్న చెర్రీ లుక్..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా హిట్ తో చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.దీంతో ఆయన తర్వాత సినిమా షూటింగ్ కూడా అదే జోష్ లో చేస్తున్నాడు.

 Rc15 Shooting Spot Charan Photo Leaked-TeluguStop.com

మొన్నటి వరకు చరణ్ ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఆయన తర్వాత సినిమాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది.ఇక ఇప్పుడు చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.

ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.

శంకర్ తన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ని ఎంపిక చేసుకున్నాడు అంటే తన సినిమాలో ఏదో సంథింగ్ ఉంటుంది అని ఆడియెన్స్ గట్టి నమ్మకం.

ఇప్పుడు ఆర్సీ 15లో కూడా అలంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది.

Telugu Shankar, Kiara Advani, Ram Charan, Ramcharan, Rc, Rc Ramcharan-Movie

తాజాగా చరణ్ లుక్ అదే చెబుతుంది.ఈ సినిమా నుండి తాజాగా చరణ్ కొత్త లుక్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం అని తండ్రి కొడుకులుగా చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా చరణ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.ఈ లుక్ లో చరణ్ పల్లెటూరి కుర్రాడి లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో ఈయన రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు అనడానికి సందేహం లేదు అనిపిస్తుంది.పంచె కట్టులో పాపిడి పక్కకు తీసి వైట్ అండ్ వైట్ లుక్ లో హ్యాండ్ మడత పెట్టి సైకిల్ పై వెళుతున్నట్టుగా కనిపిస్తున్నాడు.

Telugu Shankar, Kiara Advani, Ram Charan, Ramcharan, Rc, Rc Ramcharan-Movie

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో డిఫెరెంట్ గెటప్ తో ఆకట్టుకున్న చరణ్ ఇప్పుడు ఆర్సీ 15లో కూడా డిఫెరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టు కుంటాడు అని ఆయన ఫ్యాన్స్ డల్ ఖుషీగా ఉన్నారు.చరణ్ గెటప్ చూస్తుంటే తన లోని పూర్తి నటనను శంకర్ బయటకు తీస్తున్నట్టు కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube