ఎముకల ఆరోగ్యం జాగ్రత్త .. ఈ ఆహారపు అలవాట్లు గమనించండి

మన ఎత్తు, మన రంగు, మన ముఖకవళికలు మనచేతుల్లో ఉండకపోవచ్చు కాని, శరీర ఆరోగ్యం మాత్రం పూర్తిగా మనచేతుల్లోనే ఉంది.

చర్మం, ఎముకలు, నరాలు, రక్తం .

ప్రతి భాగాన్ని మనమే రక్షించుకోవాలి.ప్రతి భాగాన్ని మనమే బలపరుచుకోవాలి.

మనం పాటించే కొన్ని అలవాట్లు, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మన శరీరం లోపల మనకు తెలియని ప్రభావం చూపుతాయి.ఆ ప్రభావం చెడుగా ఉండకూడదు అంటే, సరైన లైఫ్ స్టయిల్ ఎంచుకోవాలి.

ఓ వయసుకి వచ్చాక, ఎముకలు బలంగా ఉంటేనే, మనలో చేవ ఉంటుంది.కాబట్టి ఎముకల బలం కోసం ఈ క్రింది ఆహారపు అలవాట్ల గురించి ఆలోచించండి.

Advertisement

* అధికంగా మాసహారం, ముఖ్యంగా రెడ్ మీట్ తీసుకోవడం ఎముకలకి అంత మంచిది కాదు.అలాగే స్వీట్స్ కూడా ఎముకలకి చేటు చేస్తాయి.

* డార్క్ చాక్లెట్ లో ఎముకలకి పనికొచ్చే లక్షణాలే కాదు, ఎముకలని బలహీనపరిచే షుగర్స్, ఆక్సలేట్ కూడా ఉంటాయి.అందుకే, చాక్లెట్ ని కంట్రోల్ లో ఉంచండి.

* ఆల్కహాల్ అతిగా సేవిస్తే చేయని చేటు ఉంటుందా.లిమిట్ దాటితే ఇది కూడా ఎముకలకి శత్రువే.

* కాఫీ శరీరంలో కాల్షియం లెవెల్స్ ని తగ్గించవచ్చు.చెప్పనక్కరలేదు, కాల్షియం లేకపోతే ఎముకలు పనికిరాకుండా పోతాయి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
మొబైల్ ఫోన్ రాత్రి పక్కన పెట్టుకొని నిద్రపోతే ప్రమాదమా.. ముఖ్యంగా పురుషులకు..

కాబట్టి కాఫీ వ్యసనపరులు కొంచెం అదుపులో ఉంచండి మీ అలవాటుని.* కొందరికి కూల్ డ్రింక్స్ పై మమకారం మరీ ఎక్కువ.

Advertisement

ఇష్టమైన హీరో తాగుతున్నాడని మీరు అలవాటు చేసుకోకండి.ఆడేడ్ షుగర్స్ విపరీతంగా ఉంటాయి కూల్ డ్రింక్స్ లో.

తాజా వార్తలు