రాజమౌళి “ఈగ” సినిమా చూసారుగా.అందులో క్లయిమాక్స్ అయిపోయాక “I am Back” అంటూ మళ్ళీ వచ్చేస్తుంది ఈగ.
మరి ఆ తరువాత ఈగ, సమంత ఎలా కలిసి ఉంటారు అని అప్పట్లో చాలామందికి వింత అనుమానాలు వచ్చాయి.మీ అనుమానానికి ఓ సమాధానం మాదగ్గర ఉంది.
ఈ ఫోటోలలో చూస్తున్న అబ్బాయి ఊరు పేరు తెలియదు కాని, ఇతగాడు ఓ 10 అడుగుల పాముని పెళ్ళి చేసుకున్నాడు.ఇదేం పిచ్చి అని అనుకుంటున్నారా.
ఇతని గర్ల్ ఫ్రెండ్ అయిదేళ్ళ క్రితం చనిపోయింది పాపం.ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఈ అబ్బాయికి అనుకోకుండా ఈ పాము దొరికింది.
ఈ సర్పాన్ని చూడగానే చనిపోయిన తన ప్రేయసి ఈ జన్మలో పాముగా పుట్టింది అని అనిపించిందట.అలా ఎందుకు అనిపించిందో తనకే తెలియాలి కాని, దాన్ని ఇంటికి తెచ్చేసుకున్నాడు.
ఆ పాముతోనే రోజంతా గడుపుతాడు.క్యారం ఆడుతాడు, జిమ్ కి వెళుతాడు, ఏం కొన్నా తినిపిస్తాడు, టీవి చూస్తాడు, బయట షికారుకి తీసుకెళతాడు.
ఓరినీ పిచ్చి పిజ్జా హట్ లో పెట్టా అని మీరు ఆశ్చర్యపోతున్నారని తెలుసు.ఈ పాముని ఏకంగా పెళ్ళి చేసుకున్నాడు.
తన ప్రేయసి చనిపోయి తనదగ్గరికి ఈ రూపంలో వచ్చిందని వితండవాదం చేస్తున్నాడు.ఏంటో ఈ వింత లోకం, ప్రేమ గుడ్డిదని తెలుసు కాని, మరీ ఇంత గుడ్డిదని ఇప్పుడే తెలిసింది.