ఏపీలో అమలులోకి రానున్న ఈ- చిట్స్ విధానం..!

ఏపీలో ఈ-చిట్స్ విధానం అమలులోకి రానుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

దీని ద్వారా చిట్ ఫండ్స్ చందాదారులు తమ డబ్బు సురక్షితంగా ఉందో, లేదో తెలుసుకోవచ్చని చెప్పారు.

ఎలక్ట్రానిక్ విధానంగా ఉండే ఈ-చిట్స్ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుందని మంత్రి ధర్మాన తెలిపారు.కాగా చిట్ ఫండ్స్ సంస్థలు ఆన్ లైన్ ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు లావాదేవీలను పరిశీలించిన అనంతరం ఆమోదిస్తారని తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు