అంగరంగ వైభవంగా జరిగిన ద్వారక తిరుమలేశుడి కళ్యాణం..!

మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి భగవంతున్ని పూజిస్తూ ఉంటారు.

అలాగే కొన్ని ఆలయాలలో భగవంతునికి కల్యాణ మహోత్సవాలు( Kalyana Mahotsavam ) కూడా ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు.అదేవిధంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా ద్వారకా తిరుమల( Dwaraka Tirumala ) చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసుని కల్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశంలో మునిగిపోయారు.స్వామి వారి వివాహ మహోత్సవానికి దేవాలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండపంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ముందుగా స్వామి అమ్మవార్లను వేరువేరు వాహనాలలో కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చారు.అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు.స్వామి అమ్మ వాళ్లకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాలయ,

Advertisement

ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ( Minister Kottu Satyanarayana ) పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు.శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ, వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జిలకర, బెల్లం పూర్తి చేశారు.ఆ తర్వాత స్వామివారి కల్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు, ఈవో వేండ్ర త్రినాధరావు పాలక మండల సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కళ్యాణం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా అందించారు.ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే స్వామి వారి ఆశీస్సులు కచ్చితంగా కావాలని తెలిపారు.

అన్ని ప్రధాన దేవాలయాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 18, గురువారం, 2021
Advertisement

తాజా వార్తలు