దసరా, దీపావళి పండగల సీజన్ వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.నాన్న గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్ plb గా ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ 2020 – 21 యేడాది బోనస్ కు ఆమోదం తెలిపింది.ఈ నిర్ణయం వల్ల దాదాపు 11.56 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది.ప్రభుత్వ ఖజానాపై రూ.
91,985 కోట్ల మేరకు భారం పడనుంది.రైల్వే ఉద్యోగులకు బోనస్ సహా పలు కీలక అంశాలను భేటీలో చర్చించారు.కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూస్ గోయల్ మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.ఉత్పాదకత ఆధారిత బోనస్ కింద నెలకు గరిష్టంగా రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తారు.ఈ లెక్కన సదరు ఒక్క ఉద్యోగి గరిష్ఠంగా రూ 17, 951 బోనస్ గా లభిస్తుంది.ప్రతి యేటాటా రైల్వే సంస్థ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్ ఇస్తుంది.
నిర్దిష్ట ఫార్ములా ప్రకారం ఉద్యోగులు 72 రోజుల వేతనం బోనస్ గా పొందాల్సి ఉంటుంది.కానీ రైల్వే ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ప్రధాన మోడీ ఆరు రోజుల వేతనాన్ని అదనంగా జోడించారు.
ప్రతి ఏటా పండగ సీజన్కు ముందు బోనస్ ప్రకటించే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.