వ‌ర్షాకాలంలో ఈ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవ్వ‌డం ఖాయం!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందుకే చాలా మంది వ‌ర్షాకాలాన్ని తెగ ఇష్ట‌ప‌డుతుంటారు.అయితే వ‌ర్షాకాలం ఆహ్లాదకరంగానే కాదు భ‌యంక‌రంగా కూడా ఉంటుంది.

ఎందుకంటే, ఈ సీజ‌న్‌లోనే వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ, చికున్‌ గున్యా, మలేరియా వంటి ప్ర‌ణాంత‌క‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.వీటి నుండి త‌ప్పించుకోవాలంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఈ జ్యూస్ ఏంటో.

Advertisement

ఎలా త‌యారు చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఐదు ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.ఇలా క‌డిగిన ఉసిరి కాయ‌ల‌ను గింజ తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్క‌లు, ఒక రెబ్బ క‌రివేపాకు, పావు స్పూన్ జీల‌క‌ర్ర‌, మూడు మిరియాలు, పావు స్పూన్ పింక్ సాల్ట్‌, ఒక గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

బాగా గ్రైండ్ చేసుకున్నాక స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకుని.వ‌న్ టేబుల్ స్పూన్‌ తేనెను మిక్స్ చేసి సేవించాలి.ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ఈ ఆమ్లా జ్యూస్‌ను ఒక గ్లాస్ చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

దాంతో సీజ‌న‌ల్‌ వ్యాధులు, వైర‌ల్ జ్వ‌రాలు, అంటు వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదండోయ్‌.ఈ అమ్లా జ్యూస్‌ను డైట్ లో చేర్చుకుంటే కంటి చూపు మెరుగ్గా మారుతుంది.

Advertisement

ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

మ‌రియు వృద్ధాప్య ల‌క్ష‌ణాలు సైతం త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు