బాలకృష్ణ వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.కథ, కథనంలోని కొన్ని లోపాలు, వేగంగా సినిమాను తెరకెక్కించడం ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడానికి ఒక విధంగా కారణమయ్యాయని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమాకు సంబంధించి వినాయక్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చెన్నకేశవరెడ్డి సినిమాకు సౌందర్యను అడిగామని అయితే సౌందర్య ఈ సినిమాను రిజెక్ట్ చేశారని వినాయక్ వెల్లడించారు.
చెన్నకేశవ రెడ్డి సినిమా ద్వారా నేను పెద్ద హీరోను సైతం హ్యాండిల్ చేయగలననే గుర్తింపు దక్కిందని వినాయక్ చెప్పుకొచ్చారు.అయితే బాలయ్యను ఊహించని స్థాయిలో చూపించాలనే ఆలోచనతో కథ మీద కొంచెం ఫోకస్ తగ్గిందని నాకు అనిపించిందని వినాయక్ కామెంట్లు చేశారు.
ఇందులో యంగ్, ఓల్డ్ పాత్రలు ఉంటాయని చెప్పగా ఓల్డ్ పాత్రకు జోడీగా వద్దని సౌందర్య తనతో చెప్పారని వినాయక్ చెప్పుకొచ్చారు.
![Telugu Balakrishna, Chennakeshava, Vv Vinayak, Shriya, Tabu, Top-Movie Telugu Balakrishna, Chennakeshava, Vv Vinayak, Shriya, Tabu, Top-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/08/this-star-heroine-rejected-chennakeshavareddy-movie-detailsa.jpg)
ఓల్డ్ పాత్రలు చేస్తే మళ్లీ ఓల్డ్ లోకి వెళ్లిపోతాం అని సౌందర్య నాతో అన్నారని వినాయక్ కామెంట్లు చేశారు.మెయిన్ హీరోయిన్ గా శ్రియను తీసుకోవాలని ముందుగానే అనుకున్నామని వినాయక్ అన్నారు.మరో హీరోయిన్ గా ఆ తర్వాత టబును తీసుకున్నామని ఆయన తెలిపారు.
![Telugu Balakrishna, Chennakeshava, Vv Vinayak, Shriya, Tabu, Top-Movie Telugu Balakrishna, Chennakeshava, Vv Vinayak, Shriya, Tabu, Top-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/08/this-star-heroine-rejected-chennakeshavareddy-movie-detailss.jpg)
బాలకృష్ణ సౌందర్య కాంబినేషన్ లో టాప్ హీరో అనే సినిమా మాత్రమే తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.ఆ తర్వాత ఈ కాంబోలో నర్తనశాల అనే సినిమా షూట్ మొదలు కాగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.చెన్నకేశవరెడ్డి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఈ సినిమా వల్ల నిర్మాతలకు నష్టాలు రాలేదని తెలుస్తోంది.